శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

by srinivas |
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం తరపున సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శ్రీవారికి పంచెకట్టు, తిరునామంతో బుధవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. అంతకు ముందు బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు జగన్‌కు పరివట్టం కట్టారు. సంప్రదాయ వస్త్రధారణతో సీఎం నుదుట నామాలు పెట్టుకున్నారు.

Advertisement

Next Story