ఏపీలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న సీఎం జగన్

by srinivas |
ఏపీలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. పాల్గొన్న సీఎం జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం వైయస్‌ జగన్‌ పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసి.. ఆంధ్రరాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

వైసీపీ కేంద్ర కార్యాలయంలోనూ వేడుకలు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్రమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున, నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ అంకంరెడ్డి నారాయణమూర్తి తదితరులు పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

Next Story

Most Viewed