- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గవర్నర్ హరిచందన్‌తో సీఎం జగన్ భేటీ
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం 5:25 గంటలకు సీఎం జగన్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాజ్‌భవన్ వద్ద గవర్నర్ హరిచందన్ సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గకపోవడం, పోలవరం బకాయిలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరో నాలుగు నెలల్లో ఏపీ కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ గవర్నర్‌ను కలవడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇకపోతే మంగళవారం గవర్నర్ హరిచందన్ జన్మదినం. అయితే ఆ రోజు రాజ్‌భవన్‌కు ఎవరూ రావొద్దని ఆదేశించిన నేపథ్యంలో సీఎం జగన్ ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.