రాత్రిపూట కర్ఫ్యూ ?

by srinivas |   ( Updated:2021-04-17 11:06:51.0  )
రాత్రిపూట కర్ఫ్యూ ?
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. వీటిని కొంతవరకు నివారించడానికి రాత్రిపూట కర్య్పూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఉన్నతాధికారులతో సీఎం జగన్ ​సమావేశమయ్యారు. గతంలో అమలు చేసిన లాక్​డౌన్ ​నిబంధనలపై సమీక్షించారు. రాత్రి వేళల్లో ఆంక్షల వల్ల కరోనా కేసులు తగ్గడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ఓ వైపు గాలిలోనే వైరస్​ ఉందనే ప్రచారం జరుగుతోంది.

ఇది వాస్తవమా ! అప్పుడు జనాన్ని తీసుకెళ్లి ఇళ్లల్లో పెట్టి తాళాలు వేసినా ప్రయోజనం లేదు. కరోనా వస్తుంది.. పోతుంది. గతంలో సీఎం చెప్పినట్టు కరోనాతో సహజీవనం తప్పదు. అలాంటప్పుడు ప్రజలంతా ఇళ్లల్లో ఉండే రాత్రి పూట ఆంక్షలతో ప్రయోజనమేంటీ ! లాక్​డౌన్​కు ముందస్తు హెచ్చరికలా ! ప్రజల్లో అవగాహన పెరిగింది. దీన్ని కూడా సీఎం సమీక్షలో పరిగణించి ఉంటే బావుండేది.

Advertisement

Next Story

Most Viewed