7న ఒంగోలుకు సీఎం జగన్.. ఎందుకంటే

by srinivas |   ( Updated:2021-10-05 01:31:24.0  )
jagan
X

దిశ, వెబ్ డెస్క్ : ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 7 వ తారీఖున ఒంగోలులో పర్యటించనున్నట్టు షెడ్యూల్ విడుదల అయింది. దాంతో నేతలంతా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్‌ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలుకు వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎం కార్యక్రమ సమన్వయకర్త తలశిల రఘురాం పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో ముందుగా పీవీఆర్‌ బాలుర పాఠశాలలోని మైదానాన్ని మంత్రి బాలినేని, తలశిల రఘురాం, సీఎం సెక్యూరిటీ ఆఫీసర్‌ వకుల్‌ జిందాల్, కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్, ఎస్పీ మలికాగర్గ్‌ పరిశీలించారు. అనంతరం మైదానంలో సీఎం కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో వారు చర్చించారు. 23 నెలల తరువాత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు వస్తుండడంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

షెడ్యూల్ ఇలా..
ఉదయం 9.55 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద నుంచి హెలికాప్టర్‌లో బయలు దేరి, 10.35 గంటలకు ఒంగోలు పోలీసు ట్రైనింగ్‌ కాలేజీకి చేరుకుంటారు. 10.45 గంటలకు హెలిపాడ్‌ నుంచి బయల్దేరి 11 గంటలకు ఒంగోలు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. 11.15 గంటలకు జ్యోతి ప్రజ్వలన, డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. 11.25 గంటలకు మంత్రుల ప్రసంగాలు, 11.40 నుంచి 12 గంటల వరకు లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి కార్యక్రమం, అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఉంటుంది. 12.30 గంటలకు వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని ప్రారంభిస్తారు. 12.40 గంటలకు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఓట్‌ ఆఫ్‌ థ్యాంక్స్‌తో కార్యక్రమం ముగుస్తుంది. 12.45 గంటలకు సభాస్థలి వద్ద నుంచి కారులో హెలిపాడ్‌కు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటారు. 1.05 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి 1.50 గంటకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం చేరుకుంటారు.

Advertisement

Next Story

Most Viewed