టీడీపీ నేతలపై జగన్ ఫైర్.. నన్ను తిట్టే తిట్లు భరించలేకే వారు అలా చేశారు

by srinivas |
CM Jagan
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై జరిగిన దాడులపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలను విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని మండిపడ్డారు. అందుకే ఎవరూ మాట్లాడలేని అన్యాయమైన మాటలు, బూతులు మాట్లాడుతున్నారని సీఎం జగన్ అన్నారు. ‘ప్రతిపక్షంలో ఉన్నవారు దారుణమైన, పరుష పదజాలం వాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. కావాలని తిట్టించి, వైషమ్యాలు రెచ్చగొట్టి, లబ్ధి పొందాలనుకుంటున్నారు. విపక్షం కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోంది’ అని జగన్‌ ఆరోపించారు.

తిట్లు విని భరించలేని అభిమానులు స్పందిస్తున్నారు. తనను అభిమానించే వాళ్లకు, ప్రేమించే వాళ్లకు బీపీ వచ్చి రియాక్షన్ కనిపిస్తోందని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పలు చానెల్స్, పత్రికలపై జగన్ ధ్వజమెత్తారు. టీడీపీకి కొమ్ముకాస్తున్నాయంటూ జగన్ విరుచుకుపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed