- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బాధ్యతలు ఇంగ్లీష్ ఛానెల్‌కి కట్టబెట్టిన జగన్
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 3 నుంచి 2020-21 విద్యాసంవత్సరం ఆరంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ విద్యాసంవత్సరం నుంచి పాఠశాల స్థాయిలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాలనే కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియం అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టాలని నిర్ణయించింది. గతంలో ఒక సారి సర్వే చేసినప్పటికీ, మరోసారి తాజాగా సర్వే చేపట్టనుంది.
అయితే గతంలో ఈ సర్వేను ప్రభుత్వ సంస్థల ద్వారా కాకుండా.. థర్డ్ పార్టీతో చేయించాలని భావిస్తోంది. దీంతో ఇందుకోసం ఒక సంస్థను కూడా ఎంపిక చేసింది. అదే సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విద్యారంగ సంస్కరణలపై షార్ట్ ఫిల్మ్స్ కూడా నిర్మించాలని నిర్ణయించింది. దీంతో ఈ బాధ్యతలు ఒక ఇంగ్లీష్ ఛానెల్‌కి అప్పగించినట్టు తెలుస్తోంది. సర్వ శిక్ష అభియాన్ కింద నిధులు వెచ్చించనుంది. ఈ ఛానెల్ వివరాలు తెలియరాలేదు. కాగా, గతంలో జగన్ ఈ ఛానెల్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు తెలుస్తోంది.