రైతులకు సీఎం జగన్ శుభవార్త..

by  |   ( Updated:2020-07-23 05:25:36.0  )
రైతులకు సీఎం జగన్ శుభవార్త..
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఓ వైపు కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నా, మరో వైపు కరోనాను కట్టడి చేస్తూనే, పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారు. అంతేగాకుండా రైతుల శ్రేయస్సు కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తూ, అందరినీ ఆకర్షిస్తున్నారు. తాజాగా వ్యవసాయ రైతులకు సీఎం జగన్ మరో శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా గురువారం రాష్ట్రంలో రైతుల కోసం గోదాములు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం కోసం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌కు దన్నుగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

రైతులు పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మించాలని భావిస్తున్నామన్నారు. తన వద్ద పంట ఉందన్న విషయం రైతు ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం) అధికారులకు తెలిపితే ఆ విషయం వెంటనే సెంట్రల్ సర్వర్‌కు చేరాలని స్పష్టం చేశారు. సెప్లెంబర్ నాటికి దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ తయారు చేయాలని సీఎం జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్ శాఖ వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. కనీస గిట్టుబాటు ధర లేని పక్షంలో ధరల స్థిరీకరణ నిధితో రైతులను ఆదుకోవాలన్నారు.

Advertisement

Next Story