మున్సిపల్ ఫలితాలపై సీఎం జగన్ ఎమన్నారంటే..?

by srinivas |
మున్సిపల్ ఫలితాలపై సీఎం జగన్ ఎమన్నారంటే..?
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నెల్లూరు కార్పొరేషన్ సహా 12 మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సాధించిన విజయాలపై సీఎం వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ఏపీ ప్రజలకు సీఎం ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు’.. ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయన్నారు.

గ్రామంతో పాటు నగరంలో కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచారన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story