సీఎం జగన్ కు మరో పదవి 

by Anukaran |
సీఎం జగన్ కు మరో పదవి 
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ మరో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ బోర్డు, ఎగ్జి‌క్యూటివ్ క‌మిటీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీ పారిశ్రామిక కారిడార్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా సీఎం జగన్ మోహన్ రెడ్డి నియమించబడ్డారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

వివిధ శాఖలకు చెందిన మరో 11 మంది ముఖ్యకార్యదర్శులను, ఉన్నతాధికారులను సభ్యులుగా పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఎగ్జిక్యూటివ్ క‌మిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Next Story