- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒక్కటే : డీకే అరుణ
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒక్కటే అని బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే అరుణ విమర్శించారు. బుధవారం నల్గొండ జిల్లా హాలియాలో టీఆర్ ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ బీజేపీ నాయకులపై చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో తగిలిన దెబ్బకు కేసీఆర్‌కు నాగార్జున సాగర్‌లో బహిరంగ సభ పెట్టారన్నారు. ఎన్నికలు వచ్చినపుడే ఆయనకు సాగర్ నియోజకవర్గం గుర్తొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
టీఆర్‌ఎస్ వీరుల పార్టీ కాదని.. ద్రోహుల పార్టీ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీకే అరుణ ఫైర్ అయ్యారు. జగన్, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే అని.. ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు వదిలిన బాణమే షర్మిల అని డీకే అరుణ చెప్పారు. టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య చీకటి ఒప్పందం కొనసాగుతోందని.. ఒకవేళ అదే నిజం కాకపోతే మేయర్ ఎన్నిక సమయంలో ఎంఐఎం మద్దతు ఎందుకు తీసుకున్నారని ఆమె విమర్శించారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.