సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. హెరిటేజ్ కోసం..

by srinivas |
సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. హెరిటేజ్ కోసం..
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు దేశం ప్రభుత్వం సహకార వ్యవస్థను భ్రష్టుపట్టించిందని సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం జగన్ అమూల్ పాల వెల్లువ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో హెరిటేజ్ సంస్థకు మేలు చేసేందుకు సహకార రంగాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. ఏ ఒక్క సహకార సంస్థను కూడా పట్టించుకోలేదన్నారు. సహకార రంగంలోని డెయిరీలను తమ ప్రైవేటు ఆస్తులుగా మార్చుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అమూల్ వచ్చాక పరిస్థితి మారిపోయిందని..డెయిరీలు తప్పక ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అమూల్ కారణంగా రైతుకు ఒక లీటరు పాలపై రూ.5 నుంచి రూ.15 వరకు అధిక రాబడి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed