శంకర్ మహదేవన్ సాంగ్‌కు స్టెప్పులేసిన సీఎం..(వీడియో వైరల్)

by Anukaran |
శంకర్ మహదేవన్ సాంగ్‌కు స్టెప్పులేసిన సీఎం..(వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్ : ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ మరోసారి వార్తలో నిలిచారు. తాజాగా ఆయన డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం ఛాంద్‌ఖురైలోని మాతా కౌసల్య దేవి దేవాలయం ప్రారంభోత్సవానికి సీఎం బఘేల్‌ వెళ్లారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో సీఎం పాల్గొన్నారు.

ఈ క్రమంలో ఫేమస్ సింగర్ శంకర్ మహదేవన్​ పాడిన పాటకు సీఎం డ్యాన్స్ స్టెప్పులు వేశారు. దీంతో పార్టీ నేతలు కూడా బఘేల్‌తో కలిసి స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story