బలపరీక్షకు సిద్ధం : గెహ్లాట్

by Shamantha N |
బలపరీక్షకు సిద్ధం : గెహ్లాట్
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరదించేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే బుధవారంలోగా అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.దీనికోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరుస్తారని తెలుస్తోంది. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను శనివారం సీఎం గెహ్లాట్ కలిశారు. కాంగ్రెస్‌కు ఇద్దరు భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) ఎమ్మెల్యేలు మద్దతిచ్చిన లేఖలను కూడా ఆయనకు చూపించారు. గవర్నర్‌, సీఎం సుమారు 45 నిమిషాల పాటు సమావేశమయ్యారని.. కరోనా పై పోరుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గెహ్లాట్ వివరించారని రాజ్‌భవన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉండాలనే షరతుతో గెహ్లాట్ ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు బీటీపీ పార్టీ అధ్యక్షుడు, ఇతర నేతలు అంగీకిరించినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజ్‌కుమార్ రోయత్, రామ్ ప్రసాద్ వెల్లడించారు.

22న బలపరీక్ష!

రాజస్థాన్ ప్రభుత్వం బలపరీక్ష కోసం వచ్చే బుధవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశపరిచే అవకాశం ఉందని సమాచారం. 200 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 19 మందికి స్పీకర్ అనర్హతా నోటీసులు ఇచ్చారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు‌, ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కలిపితే మొత్తం 109 మంది సభ్యుల మద్దతు ఉందని అధికార కాంగ్రెస్ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed