పోతిరెడ్డిపాడుపై పోరాటానికి సిద్ధమవ్వాలి : భట్టి

by Anukaran |   ( Updated:2020-08-07 08:47:32.0  )
పోతిరెడ్డిపాడుపై పోరాటానికి సిద్ధమవ్వాలి : భట్టి
X

దిశ, న్యూస్ బ్యూరో: దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ఏపీ ప్రాజెక్టులపై పోరాటానికి సన్నద్ధం కావాలని సీఎల్పీనేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కృష్ణా జలాలను వినియోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమవుతుందని, దక్షిణ తెలంగాణను పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.

శుక్రవారం భట్టి మీడియాతో మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు నీళ్లు రావని, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవో ఎఫెక్ట్ హైదరాబాద్‌ ప్రజలపై కూడా పడుతుందన్నారు. టెండర్లు పూర్తయ్యే వరకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారని భట్టి ఆరోపించారు. పోతిరెడ్డిపాడు అంశంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, దక్షిణ తెలంగాణ ప్రజలందరూ పోతిరెడ్డిపాడుపై పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

లతీఫ్ ఖాన్ మృతికి సంతాపం

ఉర్దూ ప్రఖ్యాత దినపత్రిక మున్సిఫ్ ప్రధాన సంపాదకుడు లతీఫ్ ఖాన్ అకాల మరణం పట్ల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉర్దూ పత్రిక రంగంలో ఎనలేని సేవలు చేసిన లతీఫ్ ఖాన్ మరణం పత్రికా రంగానికి తీరని లోటు అని ఉత్తమ్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed