- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భట్టిది ఏం నడుస్తలేదన్న కేటీఆర్.. కౌంటర్ ఇచ్చిన సీఎల్పీ నేత
దిశ, వెబ్‌డెస్క్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘నాకు తెలిసి భట్టి విక్రమార్క మంచోడే. కానీ, ప్రస్తుతం కాంగ్రెస్‌లో భట్టిది ఏం నడుస్తలేదు. గట్టి అక్రమార్కుడిదే నడుస్తోంది.’అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎల్పీ లీడర్‌గా నాది నడుస్తుందో లేదో అందరికీ తెలుసు అని అన్నారు. హుజురాబాద్‌లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, బల్మూరి వెంకట్ గెలుపును ఎవరూ ఆపలేరని వెల్లడించారు.
నిరుద్యోగ యువతీ, యువకుల ప్రతిరూపం కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ అని అభిప్రాయపడ్డారు. గత ఏడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉద్యోగాలు రాక నిరాశతో నిరుద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. వారందరి తరపున హుజురాబాద్‌లో వెంకట్ గెలిచి, శాసనసభలో ఉద్యోగాలపై గొంతెత్తి ప్రశ్నిస్తాడని అభిప్రాయడ్డారు. వెంకట్ బలహీనుడు కాదని, అలా అనుకునేవారికి రాజకీయ పరిజ్ఞానం లేదని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్‌లు రెండూ ఒకటే అని, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజావ్యతిరేక చట్టాలను అనేక పార్టీలు వ్యతిరేకిస్తుంటే టీఆర్ఎస్ వెనుకునుంచి మద్దతిస్తోందని ఆరోపించారు.