- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజీవ్ గృహాలను వేలం వేయొద్దు
దిశ, న్యూస్ బ్యూరో :
రాజీవ్ స్వగృహాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం నిర్మించింది. అలాంటి వాటిని వేలం వేయొద్దని సీఎల్పీనేత భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బడ్జెట్ అంటే అంకెలు, సంఖ్యలు కాదని, సామాజిక స‌్పృహతో ప్రవేశపెడతున్న బడ్జెట్ అని ఆర్థిక మంత్రి చెప్పిన మాటలకు బడ్జెట్‌కు ఏ మాత్రం పొంతన లేదని విమర్శించారు.టీఆర్ఎస్ ప్రభుత్వం రెండో దఫా అధికారంలోకి వచ్చాకా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తారనే ఆశతో తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉందని చెబుతూనే 2019-20 ఆర్థిక బడ్జెట్ -17 శాతం ఉంటే 2020-21 బడ్జెట్ 29కు తీసుకురావడం ప్రజలను మోసం చేయడం తప్ప మరొటి కాదన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అప్పులు, మద్యం తప్ప మరో మార్గం కనిపించడం లేదన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం నెలానెలా అందించే ఆసరా పింఛన్ కంటే వారు మద్యం ద్వారా ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నులే ఎక్కువగా ఉన్నాయన్నారు.
బడ్జెట్‌లో పన్నేతర ఆదాయం రూ.36వేల కోట్లు చూపించారని అదంతా ఎక్కడి నుంచి వస్తుందని ఆయన ప్రశ్నించారు.రాజీవ్ స్వగృహాలు పేద ప్రజల కోసం నిర్మించారు కావున అలాంటి వాటిని వేలం వేస్తామని చెప్పడం పేద ప్రజలను మోసంగించినట్టు అవుతుందన్నారు. ప్రభుత్వానికి నిధులు కావాలంటే వివిధ మార్గాల్లో సమకూర్చుకోవచ్చన్నారు. అంతేకాని పేదలకోసం నిర్మించిన రాజీవ్ స్వగృహాలను ముట్టుకోవద్దని భట్టి ప్రభుత్వన్ని హెచ్చరించారు.
ఉమ్మడి ఏపీలో 2007సంవత్సరంలో ప్రభుత్వ భూములను వేలం పెట్టారు. అందులో పాల్గొన్న కొన్ని కంపెనీలు నేటికి డబ్బులు చెల్లించలేదని, వారికి ఇచ్చిన గడువు కూడా ముగియడంతో అలాంటి భూములను తిరిగి వేలం నిర్వహించాలని ఆయన కోరారు. హైదరాబాద్ శివారులోని ప్రభుత్వ భూములను అక్రమాల నుంచి కాపాడి అక్కడ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం ఐటీ కంపెనీలతోనే కాకుండా ఇండస్ట్రీల వలన కూడా జరగాలని, అందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఇండస్ట్రీల రాకతో తెలంగాణలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
Tags: clp leader bhatti, assembly sessions, hyd, trs govt, rajiv swagruha houses, action