చైనా కాన్సులేట్ మూసివేత.. మంత్రి వివరణ

by vinod kumar |
చైనా కాన్సులేట్ మూసివేత.. మంత్రి వివరణ
X

దిశ, వెబ్ డెస్క్: గతకొద్దిరోజుల నుంచి చైనా దేశంపై అమెరికా తీవ్ర స్థాయిలో ఫైరవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో పలు వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని హ్యూస్టన్ లోని చైనా రాయబార కార్యాలయాన్ని మూసివేయించామన్నారు. ఈ కార్యలయాలు గూఢచర్యానికి పాల్పడుతుందని, ఈ క్రమంలోనే దానిని మూసివేయించినట్లు ఆయన వివరణ ఇచ్చారు. మేథో సంపత్తిని సైతం చైనా దోచుకుంటోందని, వీటి ద్వారా కీలక వ్యాపార రహస్యాలను ఛేదించి అమెరికాలో లక్షలాది మంది ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైందంటూ తీవ్రంగా మండిపడ్డారు. చైనా తీరు మారడంలేదని, రోజురోజుకు కుట్రలు, దౌర్జన్యాలకు తెరలేపుతుందంటూ ఫైరయ్యారు. చైనా దూకుడును తగ్గించేందుకు ప్రపంచదేశాలన్నీ కలిసి రావాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

Next Story

Most Viewed