- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా వేళ గప్‌చుప్‌గా తరగతులు.. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం
దిశ, సిరిసిల్ల : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ విద్యాసంస్థల బంద్‌కు నిర్ణయం తీసుకుంది. పాఠశాలలో పాటు వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇటీవల కరోనా రావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా అన్ని రకాల విద్యాసంస్థలను బంద్ చేయాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.
కానీ సిరిసిల్ల జిల్లా పరిధిలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు ఆ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ పాఠశాలలను నడిపిస్తున్నారు. ఉదయం వేళా రహస్యంగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఫీజులు లాగేందుకే ప్రభుత్వ ఆదేశాలను కూడా విద్యాసంస్థల యాజమాన్యం లెక్కచేయని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని RAO’S హై స్కూల్ యాజమాన్యం పదవ తరగతి విద్యార్థులకు రహస్యంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే స్కూల్ కు చేరుకున్న విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తుండగా అక్కడికి మీడియా ప్రతినిధులు చేరుకోవడంతో సిలబస్ పూర్తి కాకపోవడంతో రహస్యంగా క్లాసులు నిర్వహిస్తుతున్నట్లు ఉపాధ్యాయుడు తెలిపారు.
పాఠశాలకు చెందిన యూనిఫాంలలో విద్యార్థులు వస్తే ఎవరైనా అధికారులకు ఫిర్యాదు చేస్తారేమోననే భయంతో తల్లిదండ్రులకు ముందస్తుగా వాట్సాప్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. పిల్లలను యూనిఫాంలతో కాకుండా సివిల్ డ్రెస్సుల్లో పంపించాలని సూచిస్తున్నారు. ఈ విధానాన్ని పట్టణంలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలు అనుసరిస్తుండడం గమనార్హం.