- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జగదీశ్‌రెడ్డి VS ఉత్తమ్ కుమార్‌రెడ్డి
దిశ, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియంత్రిత పంటల సాగు విధానంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నియంత్రిత పంటల సాగు సమావేశం కాస్త రసాభాసగా మారింది. స్టేజ్ మీదనే.. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో.. ఆఫ్ట్రాల్.. నువ్వెంత అంటే నువ్వెంతా అనుకునే స్థాయికి చేరుకుంది వారి వాగ్వాదం. దేశంలోనే రైతు బాంధవుడు కేసీఆర్ అని, రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని జగదీష్ రెడ్డి అన్నారు. దీనిపై ఉత్తమ్ స్పందిస్తూ ‘మంత్రి చెబుతున్నదంతా అబద్దాలు.. రైతు రుణమాఫీ జరగలేదు’ అంటూ.. ఫైర్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా సమావేశ మందిరం ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ సాక్షిగా రికార్డులు చెక్ చేసుకోవాలంటూ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.