హరీష్‌కు ప్రగతిభవన్‌లోకి నో ఎంట్రీ? నిజమేనా?

by Shyam |   ( Updated:2021-11-02 04:10:20.0  )
హరీష్‌కు ప్రగతిభవన్‌లోకి నో ఎంట్రీ? నిజమేనా?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్‌గా పేరు తెచ్చుకున్న టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మంత్రి హరీష్‌రావుపై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదోక తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంటుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో హరీష్ రావుకు విబేధాలు ఉన్నాయనే వార్తలతో పాటు ఆయన పార్టీ మారతారనే ప్రచారం కూడా గతంలో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. తర్వాత వాటిపై హరీష్ రావు క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు చెక్ పడింది.

ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్న వేళ మంత్రి హరీష్‌రావుపై మరో వార్త సోషల్ మీడియాలో పెను సంచలనం రేపుతోంది. ప్రగతిభవన్‌కు వెళ్లేందుకు హరీష్‌కు పాస్ ఇవ్వలేదనే వార్త ఉదయం నుంచి వాట్సప్ గ్రూపుల్లో తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిపై ప్రగతిభవన్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. హరీష్ కు పాస్ నిరాకరించినట్లు వాట్సప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న వార్తలో అసలు వాస్తవం లేదని, కొంతమంది కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రగతిభవన్ వర్గాలు చెబుతున్నాయి.

కాగా హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ బాధ్యతలను హరీష్ రావుకు సీఎం కేసీఆర్ అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో హరీష్ హుజురాబాద్ లోనే మకాం వేసి జోరుగా ప్రచారం నిర్వహించారు. హుజురాబాద్ ఉపఎన్నికలు ముగిసే వరకు హరీష్ అక్కడే ఉండి టీఆర్ఎస్ బాధ్యతలను చూసుకున్నారు. టీఆర్‌ఎస్ ను గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేశారు. కానీ హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాల వేళ సీన్ రివర్స్ అయింది. కారు జోరుకు బ్రేకులు పడి కమలం వికసిస్తోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంత మండలమైన వీణవంక, సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకం ప్రారంభించిన శాలపల్లిలోనూ బీజేపీ ఆధిక్యం సాధించడం గులాబీ వర్గాలకు మింగుడు పడటం లేదు.

ఇలాంటి తరుణంలో హుజురాబాద్ ఉపఎన్నికల టీఆర్‌ఎస్ బాధ్యతలను మోసిన హరీష్ రావు ప్రగతిభవన్ లోకి వెళ్లేందుకు పాస్ నిరాకరించారనే వార్త సోషల్ మీడియాలో దుమారం రేపడం సరికొత్త చర్చకు దారితీసింది. అయితే ఇందులో నిజం లేదని ప్రగతి భవన్ వర్గాలు క్లారిటీ ఇవ్వడంతో.. టీఆర్‌ఎస్ కార్యకర్తలు, హరీష్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

సిద్దిపేటలో నిశ్శబ్దం.. నిరాశలో మంత్రి హరీష్

హుజురాబాద్ ఫలితాల వేళ హరీష్‌కు షాక్.. పట్టించుకోని ఆ గ్రామ ప్రజలు

Advertisement

Next Story

Most Viewed