కాజల్ ప్రెగ్నెన్సీపై క్లారిటీ.. పిక్స్ వైరల్..

by Shyam |   ( Updated:2024-03-14 13:15:38.0  )
కాజల్ ప్రెగ్నెన్సీపై క్లారిటీ.. పిక్స్ వైరల్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ గతేడాది వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అమ్మడు అమ్మ కానుందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. వీటిపై స్పందించిన కాజల్ వీటిపై సరైన సమయంలో మాట్లాడతానని చెప్పింది. అయితే ప్రస్తుతం కాజల్ ఫొటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వీటిలో కాజల్ బేబీ బంప్‌తో దర్శమిస్తోంది. ఈ ఫొటోలు వరుసగా లీక్ అవుతున్నాయి. వీటిలో కాజల్ తన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది. దీంతో అభిమానులు అందుకనే కాజల్ తన అప్‌కమింగ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని, ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం అంతగా యాక్టివ్‌గా ఉండటం లేదని భావిస్తున్నారు. మరి అమ్మడు ఈ తీపి కబురు తనంతట తాను ఎప్పుడు చెప్తుందో చూడాలి.

Advertisement

Next Story