- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్రెంచ్ ఓపెన్‌పై క్లారిటీ
దిశ, స్పోర్ట్స్ : ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ ఈ ఏడాది జరుగుతుందా లేదా అనే సందిగ్దత నెలకొన్నది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది మే 23 నుంచి రోలాండ్ గారోస్‌లో ఫ్రెంచ్ ఓపెన్ జరగాల్సి ఉంది. కరోనా సెకెండ్ వేవ్ పెరిగిపోతుండటంతో ఈ ఏడాది కూడా వాయిదా వేస్తారనే కథనాలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కూడా కరోనా కారణంగా ఫ్రెంచ్ ఓపెన్‌ను నిర్ణీత షెడ్యూల్ కంటే 4 నెలలు ఆలస్యంగా నిర్వహించారు. ఇక ఇప్పుడు కూడా అలాగే వాయిదా వేస్తారంటూ యూరోప్ మీడియా కథనాలు వెలువరించాయి.
క్రీడాకారులు కూడా అంతర్జాతీయ ప్రయాణాలు చేయడానికి ఇష్టపడటం లేదని పేర్కొన్నాయి. కాగా, దీనిపై రోలాండ్ గారోస్ నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. ‘క్లే సీజన్ ఈ ప్రారంభం కానున్నది.. ఇంతకంటే ఇంకా ఏమీ చెప్పలేము’ అంటూ నిర్వాహకులు ట్వీట్ చేశారు. అయితే తేదీలపై మాత్రం పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. వచ్చే వారంలోపు షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉన్నది.