- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈనెల 24న సొంతూరుకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. 24న తన స్వగ్రామం కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పొన్నవరానికి వెళ్లనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన స్వగ్రామానికి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇకపోతే 26న ఏపీ రాష్ట్రస్థాయి న్యాయాధికారుల రెండో సదస్సులో పాల్గొననున్నారు. అదే రోజు ఏపీ హైకోర్టును కూడా సీజేఐ జస్టిస్ రమణ సందర్శించనున్నారు. ఇటీవలే ఏపీ హైకోర్టులో సరైన వసతులు లేవంటూ న్యాయమూర్తులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మౌలిక వసతులు లేవని న్యాయమూర్తులు ఆరోపించారు. ఇలాంటి తరుణంలో జస్టిస్ ఎన్వీ రమణ హైకోర్టును సందర్శించడం ఆసక్తికరంగా మారింది.
Advertisement
Next Story