- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్ర వ్యాప్తంగా 8.57 లక్షల మందికి రేషన్
దిశ, మెదక్: కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత రేషన్ బియ్యం పంపిణీని రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 8.57 లక్షల మందికి అందజేశామని తెలంగాణ పౌర సరఫరాల చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోనీ రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శ్రీనివాస్‌తో పాటు రాష్ట్ర ఇండస్ట్రియల్ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటిస్తూ మూడు మీటర్ల దూరంలో ఉండి బియ్యాన్ని తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 58 శాతం మంది లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేసినట్టు శ్రీనివాస్ వెల్లడించారు.
tags: gajwel, siddipet, civil supply, mareddy srinivasa reddy, free ration supply, vanteru prathapareddy, white ration card holders