‘కార్పొరేట్ల సేవలో మోడీ ప్రభుత్వం’

by Shyam |   ( Updated:2021-06-10 09:08:47.0  )
CITU State President Chukka Ramulu fires on Bjp Government
X

దిశ, పటాన్ చెరు: కరోనా బారినపడి ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల సేవలో తరిస్తోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలోని శాండ్విక్ పరిశ్రమ వద్ద శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఐటీయూ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా గురువారం పరిశ్రమ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో చుక్కా రాములు పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిర్వహించిన నిరసనలో చుక్కా రాములు మాట్లాడుతూ.. కరోనా టీకాల ఉత్పత్తిని సరిపడా పెంచి అందరికీ ఉచిత టీకాలు వేయాలని, కరోనా 3 వ దశకు సరిపడా బెడ్స్, ఆక్సిజన్, మందులు, ఆరోగ్య మౌలిక సదుపాయాలు ముందుగానే సిద్ధం చేయాలని అన్నారు.

ఆదాయపన్ను పరిధిలో లేని కుటుంబాలకు నెలకు 7,500 రూపాయలు చెల్లించాలని, కొవిడ్ తో చనిపోయిన కార్మిక కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని, కరోనా బారినపడి చనిపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని, 4 లేబర్ కోడ్స్, వ్యవసాయ చట్టాలు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ నాయకులు పి.పాండురంగా రెడ్డి, ఎన్.శ్రీనివాస రావు, ఎం.సత్తిబాబు, హెచ్.వెంకట్ రావు, బి.ప్రదీప్ కుమార్, బి.వి..ఆర్.కె రాజు, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed