సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుళ్లు అరెస్ట్‌.. ఎందుకంటే !

by srinivas |
సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుళ్లు అరెస్ట్‌.. ఎందుకంటే !
X

దిశ, విశాఖపట్నం: సీఐఎస్ఎఫ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేసిన ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసిన సంఘటన మంగళవారం విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీఐఎస్ఎఫ్‌ కానిస్టేబుళ్లు బి. మనోజ్‌కుమార్, ఎ. వెంకటరమణ, బి. హరిబాబు ఇటీవల ముగ్గురు యువకులను పరిచయం చేసుకొని రూ.8లక్షలు ఇస్తే ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని చెప్పారు. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ముగ్గురు యువకులు నగదు మొత్తం చెల్లించారు. కానీ డబ్బులిచ్చి నెలరోజులు గడుస్తున్నా ఎలాంటి కాల్ లెటర్లు రాకపోవడంతో ముగ్గురు కానిస్టేబుళ్లను యువకులు ప్రశ్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో విశాఖ పోలీసులను ఆశ్రయించగా.. ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story