Allu Arjun: మీ నిర్ణయం తెలుగు సినిమా ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.. అల్లు అర్జున్ ట్వీట్

by Hamsa |   ( Updated:2024-12-11 06:31:26.0  )
Allu Arjun: మీ నిర్ణయం తెలుగు సినిమా ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.. అల్లు అర్జున్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) ‘పుష్ప-2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించిన.. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. అయితే ‘పుష్ప-2’(Pushpa 2: The Rule ) భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. టికెట్ రేట్స్ పెంచుకునేందుకు గానూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

‘‘టికెట్ రేట్లు పెంపును ఆమోదించినందుకు తెలంగాణ(Telangana) ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఇచ్చిన కొత్త జీవో ఆలోచనాత్మక నిర్ణయం. ఇది తెలుగు సినిమా ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది. చలనచిత్ర పరిశ్రమను బలోపేతం చేస్తూనే ఉన్న ఆయన తిరుగులేని మద్దతుకు నా కృతజ్ఞతలు. అలాగే గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి(Sri Komatireddy) కెవిఆర్ గారికి కూడా థాంక్స్. వారు చిత్ర పరిశ్రమకు ఎనలేని సహాయ సహకారాలు అందించారు’’ అని రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed