బేబీ పింక్ డ్రెస్‌లో యంగ్ బ్యూటీ.. ‘జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్’ అంటున్న నెటిజన్లు

by Kavitha |   ( Updated:2024-09-13 06:45:57.0  )
బేబీ పింక్ డ్రెస్‌లో యంగ్ బ్యూటీ.. ‘జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్’ అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా కెరీర్ బిగినింగ్‌లో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోయిన ఈ బ్యూటీకి అనుకున్నంత స్టార్‌డమ్ అయితే రాలేదు. కానీ, ఈమె చేసిన పాత్రల పేర్లు మాత్రం గుర్తుండి పోయేలా నటించింది ఈ భామ. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. తర్వాత కొద్ది గ్యాప్‌లోనే నిశ్చితార్ధం బ్రేక్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. అనంతరం బాగా చిక్కిపోయి కనపడింది. ఇప్పుడిప్పుడే కాస్త బెటర్‌గా కనిపిస్తున్న మెహ్రీన్.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలను, ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా మెహ్రీన్ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బేబీ పింక్ కలర్ డ్రెస్ వేసుకొని థైస్ కనిపించేలా ఫొటోలకు పోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు ‘జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్’, ‘బ్యూటిఫుల్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.

(video link credits to mehreen pirzadaa instagram id)

Advertisement

Next Story

Most Viewed