ఆ స్టార్ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందంటూ Naga Shaurya కామెంట్స్ వైరల్!

by Hamsa |   ( Updated:2023-07-19 06:39:34.0  )
ఆ స్టార్ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందంటూ Naga Shaurya  కామెంట్స్ వైరల్!
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో నాగశౌర్య పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హిట్ కొట్టి లవర్ బాయ్‌గా ఇమేజ్ దక్కించుకున్నాడు. ఇటీవల ‘రంగబలి’ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన నాగశౌర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్లు ఓ వార్త హల్ చల్ చేస్తోంది .‘‘ నేను వర్క్ చేసిన హీరోయిన్స్‌తో ఎఫైర్ రూమర్స్ రాస్తుంటారు. మాళవిక, రాశి ఖన్నాతో పాటు పలువురు హీరోయిన్లతో లింక్ పెడుతూ వార్తలు వచ్చాయి. అవన్నీ ఫేక్ న్యూస్‌లు. నేను ఏ హీరోయిన్ తోనూ డేటింగ్ చేయలేదు. నాకు హీరోయిన్ అనుష్క శెట్టి అంటే చాలా ఇష్టం. ఆమెతో లింక్ కట్టి ఎవరూ వార్తలు రాయలేదు. అనుష్క శెట్టితో ఎఫైర్ పెట్టి న్యూస్ రాయండి ప్లీజ్’’ అంటూ చెప్పుకొచ్చాడట. మరి ఇందులో నిజమెంత అనేది తెలియదు.

ఇవి కూడా చదవండి: Keerthi Suresh :: మొత్తానికి బాలీవుడ్ ఎంట్రీకి రెడీ..!!

Advertisement

Next Story