Vishwak Sen: అతని కెరీర్లోనే ది బెస్ట్ మూవీ ఇది.. విశ్వక్సేన్ రివ్యూ

by Rani Yarlagadda |   ( Updated:2024-11-03 14:22:07.0  )
Vishwak Sen: అతని కెరీర్లోనే ది బెస్ట్ మూవీ ఇది.. విశ్వక్సేన్ రివ్యూ
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది దీపావళికి ప్రధానంగా మూడు సినిమాలు భారీ అంచనాల నడుమ రిలీజవ్వగా.. మూడు సినిమాలు మంచి టాక్ సొంతం చేసుకున్నాయి. అమరన్ (Amaran), క(Ka), లక్కీభాస్కర్ (Lucky Bhaskar).. దేనికదే స్పెషల్ మూవీ. ప్రేక్షకులు తమ అభిమాన హీరోలకు, నచ్చిన కథకు పట్టం కట్టారు. అమరన్ సినిమా మూడురోజుల్లోనే వందకోట్ల రూపాయల క్లబ్ లో చేరిపోయింది. ఫీల్ గుడ్ మూవీగా థియేటర్లలో దూసుకెళ్తోంది. ఇక KA సినిమాకు తొలిరోజు తక్కువ స్క్రీన్లు ఇవ్వగా.. సెకండ్ డే నుంచి స్క్రీన్లను పెంచారు డిస్ట్రిబ్యూటర్లు. లక్కీ భాస్కర్ కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది. మనిషికి డబ్బెంత అవసరమో, డబ్బుంటేనే మనిషికి గౌరవం ఉంటుందా అనే కోణంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల ప్రశంసలు అందుకుంటోంది.

తాజాగా లక్కీ భాస్కర్ సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు యంగ్ హీరో విశ్వక్సేన్ (Vishwak Sen). నిన్న రాత్రే లక్కీ భాస్కర్ సినిమా చూశానని, వెంకీ అట్లూరీ డైరెక్షన్ మరో లెవల్ అని ప్రశంసలు కురిపించాడు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సినిమా తీసి.. మరో శిఖరానికి చేరుకున్నాడని పేర్కొన్నారు. ఇక దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) కెరీర్లోనే ఈ సినిమాలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని, మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary) కూడా తన నటనతో ఆకట్టుకుందన్నారు. జీవీ ప్రకాశ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందన్నారు. ఇంత మంచి కంటెంట్ ను అందించిన టీమ్ కు అభినందనలు తెలిపారు. ఈ సినిమాను థియేటర్లలో చూస్తేనే మంచి కిక్ ఉంటుందని, ఆ అనుభూతిని మిస్ కావొద్దని చెప్పారు.

విశ్వక్సేన్ పోస్ట్ పై దుల్కర్ సల్మాన్ స్పందించారు. మీకు ఈ సినిమా నచ్చి, ఇంత పాజిటివ్ రివ్యూ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.. థ్యాంక్యూ బ్రదర్ అని తెలిపారు. మెకానిక్ రాకీ (Mechanic Rocky) సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సినిమా నవంబర్ 22న థియేటర్లలో విడుదల కానుండగా.. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇందులో కూడా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్ అనే మరో అమ్మాయి సెకండ్ హీరోయిన్ గా నటించింది.


Click Here For Twitter Post..

Advertisement

Next Story