- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘మ్యాడ్-2’లో విజయ్ దేవరకొండ హీరోయిన్ స్పెషల్ డ్యాన్స్.. సోషల్ మీడియా షేక్ అవడం ఖాయం అంటున్న నెటిజన్లు

దిశ, సినిమా: నార్నే నితిన్(Narne Nitin), సంగీత్ శోభన్(Sangeet Shobhan), రామ్ నితిన్(Ram Nitin) కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యాడ్-2’. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రాబోతుంది. అయితే ఈ సినిమా యువతను గిలిగింతలు పెట్టడంతో పాటు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయిన‘మ్యాడ్’చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments), ఫార్చ్యూన్ ఫోర్(Fortune Four) సినిమాస్ బ్యానర్స్‌పై సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ(Naga Vamsi) నిర్మిస్తున్నారు. ‘మ్యాడ్-2’మూవీకి భీమ్స్ సంగీతం అందిస్తుండగా.. భారీ అంచనాల మధ్య మార్చి 28న విడుదల కాబోతుంది.
అయితే ఇప్పటికే ‘మ్యాడ్-2’ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘మ్యాడ్-2’మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ ప్రియాంక జువాల్కర్ ఓ స్పెషల్ డ్యాన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సోషల్ మీడియా షేక్ అవడం ఖాయమని అంటున్నారు.
కాగా, ప్రియాంక, విజయ్ దేవరకొండ కలిసి నటించిన ‘టాక్సీవాలా’మూవీలో నటించి మెప్పించారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం ఏ మూవీ లేదు. దీంతో సోషల్ మీడియాకే పరిమితం అయింది. నిత్యం సోషల్ మీడియాలో పలు ఫొటోలు షేర్ చేస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది.
Read More..