Vicky Kaushal: అలాంటి పాత్ర దొరకడం నా అదృష్టం.. స్టార్ హీరో ఆసక్తికర కామెంట్స్

by Kavitha |
Vicky Kaushal: అలాంటి పాత్ర దొరకడం నా అదృష్టం.. స్టార్ హీరో ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఛావా’(Chhaava). లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మిస్తున్నారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో.. అక్షయ్‌ఖన్నా(Akshay Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రస్తుతం ప్రమోషన్ల బిజీలో ఉంది మూవీ టీమ్. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్‌(Hyderabad)లో ‘జానే తూ’(Jaane Tu) సాంగ్‌ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి హీరో విక్కీ కౌశల్‌తో పాటు రష్మిక కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా విక్కి కౌశల్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ లాంటి పాత్ర దొరకడం నా అదృష్టం. జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం వరిస్తుంది.

ఈ సినిమా కోసం నేను శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డా. షూటింగ్‌కు ఆరేడు నెలల ముందు నుంచే కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారిల్లో శిక్షణ తీసుకున్నా. వీటన్నిటి కంటే శంభాజీ మహారాజ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం, ఆ పాత్రకు తగ్గట్లుగా నా మనసును సన్నద్ధం చేసుకోవడం సవాల్‌గా అనిపించింది. ఛత్రపతి శివాజీ.. శ్రీరాముడు లాంటి వారు.

శంభాజీ.. సింహం లాంటి యోధుడు. ఈ పాత్రల్ని ఇంతకంటే గొప్పగా నేను వర్ణించలేను. ఇలాంటి నిజమైన యోధుల కథను ప్రేక్షకులకు చూపించబోతున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. రెహమాన్ సంగీత దర్శకత్వంలో పని చేయాలన్న కల ఈ సినిమాతో నెరవేరింది’ అని చెప్పుకొచ్చాడు హీరో విక్కీ కౌశల్. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed