- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్ ‘సలార్’పై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్.. సినిమా హిట్టా.. ఫట్టా?
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి నిత్యం వార్తల్లో నిటుస్తుంటారు. సెలబ్రీటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ వేణు స్వామి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. మొదట సమంత, నాగచైతన్య పెళ్లి కాకముందే వారు విడిపోతారని చెప్పి సంచలనం సృష్టించారు. నిజంగానే వారు విడాకులు తీసుకుని విడిపోవడంతో అప్పటి నుంచి వేణు స్వామిని అందరూ నమ్ముతున్నారు. రష్మిక, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి వంటి హీరోయిన్లు వేణు స్వామిని ఇంటికి పిలిపించుకుని ప్రత్యేకంగా పూజలు కూడా చేయించుకున్నారు. ఇటీవల ప్రభాస్ ‘ఆదిపురుష్’ ఎటువంటి సంచలనాలు నమోదు చేయదని, హిట్ అయ్యే అవకాశమే లేదని విడుదలకు రెండు వారాల ముందే చెప్పారు. చివరికి అదే జరిగింది.
ఈ క్రమంలో అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ‘సలార్’ సినిమా రిజల్ట్‌పై వేణు స్వామి పలు ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. ‘సలార్’ చిత్రం కూడా భారీ అంచనాలు పెట్టుకొని థియేటర్స్ కి వెళితే నిరాశ చెందే ప్రమాదం ఉంది. అనుకున్న రేంజ్ లో ఈ సినిమా విజయం సాధించే అవకాశం లేదని వేణు స్వామి చెప్పినట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ వార్త మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది. కాగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. రెండు భాగాలుగా రాబోతోంది. ఇందులో డార్లింగ్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సలార్ పార్ట్ 1 ను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయబోతున్నారు మేకర్స్.
Read More..