ఆ పనికి నో చెబుతున్న వరుణ్ తేజ్.. బాగా హర్ట్ అవుతున్న లావణ్య?

by Hamsa |   ( Updated:2023-06-19 08:20:30.0  )
ఆ పనికి నో చెబుతున్న వరుణ్ తేజ్.. బాగా హర్ట్ అవుతున్న లావణ్య?
X

దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ‘మిస్టర్’ సినిమాలో నటించి ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. జూన్ 9న పెద్దలను ఒప్పించి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వరలో వీరి ప్రేమ మొదలైన ప్రదేశం ఇటలీలో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ జంట నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి వారికి సంబంధించి పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, వరుణ్, లావణ్యను ఇంటర్వ్యూ చేసేందుకు కొన్ని చానల్స్ వెంబడిస్తున్నాయి. వాటికి లావణ్య త్రిపాఠి కాబోయే భర్తతో ఇంటర్వ్యూల్లో పాల్గొనాలని చాలా ఉత్సాహం చూపిస్తుందట. కానీ వరుణ్ తేజ్ మాత్రం పెళ్లికి ముందే ఇవన్నీ ఎందుకని నో చెబుతున్నాడట. దీంతో లావణ్య బాగా హర్ట్ అవుతోందట. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘గాండీవధారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు లావణ్య కూడా పలు చిత్రాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగ్‌లో పాల్గొంటుంది.

Read More: ఏకంగా బడా నిర్మాతలకే నో చెప్పిన మెగా డాటర్.. ఎందుకో తెలుసా?

Advertisement

Next Story