Lavanya tripathi : లావణ్యకు బిగ్ సర్‌ఫ్రైజ్ ఇవ్వబోతున్న వరుణ్ తేజ్‌..!

by Hamsa |   ( Updated:2023-10-08 11:01:37.0  )
Lavanya tripathi : లావణ్యకు బిగ్ సర్‌ఫ్రైజ్ ఇవ్వబోతున్న వరుణ్ తేజ్‌..!
X

దిశ, వెబ్‌డెస్క్: లవ్ కపుల్ వరుణ్- లావణ్య ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. త్వరలో ఇటలీ టస్కానీ‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు. ఇక ఇటీవల పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరి పెళ్లి పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ కపుల్‌కు సంబంధించిన వార్తలు ఎన్నో వచ్చాయి. తాజాగా, వరుణ్ పెళ్లి అయ్యాక లావణ్యకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మధ్య సెలబ్రీటీలు పెళ్లైన రెండు రోజులకే మళ్లీ షూటింగ్స్‌లో బిజీ అవుతున్నారు. కానీ వరుణ్ తేజ్ మాత్రం పెళ్లి తర్వాత నెల రోజులు భార్యతోనే టైమ్ స్పెండ్ చేయాలని అనుకుంటున్నాడట. అలాగే బ్యాక్ టు బ్యాక్ వెకేషన్స్‌కు వెళ్తూ లావణ్యను హ్యపీగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాడట.

Advertisement

Next Story