Tollywood Hero: తెలుగులో అట్టర్ ఫ్లాప్.. హిందీలో 100 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఆ స్టార్ హీరో?

by Prasanna |   ( Updated:2025-01-29 13:05:13.0  )
Tollywood Hero: తెలుగులో అట్టర్ ఫ్లాప్.. హిందీలో 100 మిలియన్ల వ్యూస్.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ఆ స్టార్ హీరో?
X

దిశ, వెబ్ డెస్క్ : పూరి జగన్నాథ్ ( Puri Jagannadh) దర్శకత్వంలో రామ్ పోతినేని ( Ram Pothineni) హీరోగా తెరకెక్కిన " ఇస్మార్ట్ శంకర్ " ( iSmart Shankar ) ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. రూ.20 కోట్లు తీస్తే రూ. 85 కోట్లు కలెక్ట్ చేసి రామ్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ పెద్ద విజయం సాధించడంతో సీక్వెల్ గా 'డబుల్ ఇస్మార్ట్' ( Double iSmart ) వచ్చింది. భారీ అంచనాలతో గతేడాది ఆగస్టు 15న ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. మూవీలో పూరి మార్క్ కనిపించకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు.

అయితే, తెలుగులో అట్టర్ ప్లాప్ అయిన ఈ మూవీ .. హిందీలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇస్మార్ట్‌ శంకర్‌ హిందీ డబ్బింగ్ వెర్షన్‌ ను యూట్యూబ్ లో రిలీజ్ చేయగా.. ఊహించని స్పందన వస్తోంది. RKD Studios యూట్యూబ్ ఛానెల్ లో విడుదల చేయగా.. 100 మిలియన్లకుపైగా వ్యూస్‌ సాధించింది. అంతే కాదు, 1 మిలియన్ లైక్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ చిత్రానికి భారీ బడ్జెట్ పెట్టారు .. కానీ, ఫెయిల్యూర్‌ గా మిగిలిపోయింది. ఈ సమయంలో చిత్రబృందానికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. పూరి జగన్నాథ్- ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో నిధి కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు సంజయ్‌ దత్‌ విలన్‌గా నటించగా.. అలీ, గెటప్‌ శ్రీను, షాయాజీ షిండే నటీ నటులు కీలక పాత్రల్లో నటించారు.

ప్రస్తుతం హీరో రామ్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ మహేష్ ( Mahesh ) డైరెక్షన్ లో 'రాపో 22' ( RAPO 22) మూవీ చేస్తున్నారు. ఇటీవలే, పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇందులో భాగ్య శ్రీ ( bhagyashri borse ) హీరోయిన్ గా నటిస్తోంది. చూడబోతుంటే హీరో రామ్ లుక్ గత సినిమాల కంటే డిఫెరెంట్ గా ఉండబోతుందని ప్రీ లుక్ చూస్తేనే తెలుస్తోంది. మరి, ఈ సినిమా అయినా హిట్ అయి రామ్ ని స్టార్ గా నిలబడుతుందా? లేదనేది చూడాలి.

Next Story