Pushpa 2 -Traffic Advisory: పుష్ప మాస్ జాతరకు హైదరాబాద్‎లో రోడ్లు క్లోజ్.. ట్రాఫిక్ డైవర్షన్ లిస్ట్ ఇదే

by Anjali |   ( Updated:2024-12-01 16:33:41.0  )
Pushpa 2 -Traffic Advisory: పుష్ప మాస్ జాతరకు హైదరాబాద్‎లో రోడ్లు క్లోజ్.. ట్రాఫిక్ డైవర్షన్ లిస్ట్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: సుకుమార్(Sukumar) దర్శకత్వంలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప-2’(Pushpa-2) కోసం చిత్ర బృందం భారీగా ఈవెంట్లు నిర్వహిస్తుంది. ఇప్పటికే పలు చోట్ల ప్రమోషన్లు పూర్తి చేసుకున్న ఈ టీమ్ రేపు (డిసెంబరు 2) హైదరాబాదు(Hyderabad) నగరంలో పుష్ప వైల్డ్ ఫైర్ జాతర(Pushpa Wild Fire Fair) పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. యూసుఫ్‌గూడ(YusufGuda)లో ఉన్న కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం(Kotla Vijay Bhaskar Reddy Stadium) వెనుక పోలీస్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు జరపనున్నారు.

కాగా ఓపెన్ గ్రౌండ్ కావడంలో అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions) విధించినట్లు హైదరాబాదు పోలీసు డిపార్ట్మెంట్(Hyderabad Police Department) ప్రెస్ నోట్(Press note) రిలీజ్ చేసింది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు ఉండనున్నాయని వెల్లడించింది. పుష్ప వైల్డ్ ఫైర్ జాతర ట్రాఫిక్ ఆంక్షలు ఎంటో ఇప్పుడు చూద్దాం..

యూసుఫ్ గూడ(Yusuf Guda) చెక్ పోస్ట్ నుండి అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio) వైపు మోర్ సూపర్ మార్కెట్ వరకు రోడ్‌ క్లోజ్

జూబ్లీహిల్స్(Jubilee Hills) చెక్ పోస్ట్ నుంచి యూసుఫ్ గూడ మెట్రో వైపు వెళ్లే వాహనాలను మోర్ మార్కెట్)(More market) వద్ద నుంచి శ్రీ నగర్ కాలనీ, పంజాగుట్ట(Panjagutta) వైపు దారి డైవర్షన్

మైత్రీవనం(Maitrivanaṁ) నుంచి బోరబండ(Bōrabaṇḍa) వెళ్లే వాహనాలు యూసుఫ్ గూడ సవేరా ఫంక్షన్ హాల్ దగ్గర యు టర్న్ తీసుకొని కృష్ణకాంత్ పార్క్ మీదుగా కళ్యాణ్ నగర్ మీదుగా బోరబండ వైపుగా వెళ్లాలని సూచించారు.

బోరబండ నుంచి మైత్రీవనం వైపు వచ్చేవాళ్ళు యూసుఫ్ గూడ రాకుండా కళ్యాణ్ నగర్(Kalyan Nagar) మీద నుంచి ఎస్ఆర్ నగర్(SR Nagar) నుంచి మైత్రివనం వైపు ప్రయాణించాలి.

మైత్రివనం నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, మాదాపూర్(Madapur) వైపు వెళ్లే వాహనాలు యూసుఫ్ గూడ బస్తి నుంచి ఆర్బీఐ క్వార్ట్రర్స్(RBI Quarters) మీదుగా శ్రీనగర్ కాలనీ మీదుగా రోడ్ నెంబర్ 5 నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్‎కు మళ్లింపు

ఇక ఈవెంట్‎కి వచ్చేవాళ్ళు తమ వీలర్స్ జానకమ్మ తోటలో, కార్లు అయితే సవేరా ఫంక్షన్ హాల్(Savera Function Hall), మహమ్మద్ ఫంక్షన్ హాల్(Mohammed Function Hall) లో పార్కింగ్ చేయాలి. మరీ రేపు అటు వైపు నుంచి వెళ్ళేవాళ్ళు ఈ ట్రాఫిక్ ఆంక్షలు గుర్తుపెట్టుకొని ప్లానింగ్ చేసుకోండి.

Read More...

Pawan Kalyan: మెగా ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ‘పుష్ప-2’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు డిప్యూటీ సీఎం?


Advertisement

Next Story

Most Viewed