- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TUWJ: నూతన అక్రెడిటేషన్ కార్డుల జారీ చేయాలి
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుందని టీయూడబ్ల్యూజే అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్ అన్నారు. సోమవారం ఐఅండ్ పీఆర్ కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి విధిగా జారీ చేసే అక్రిడిటేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఆరు నెలల కిందటే గతంలో జారీ చేసిన కార్డుల పరిమితి ముగిసిందని, ఈ నేపథ్యంలో నూతన కార్డులను జారీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే రెండు ధపాలుగా వాయిదా వేసిందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి బస్ పాస్‌ను రెన్యూవల్ చేసుకోవడం, కార్డులపై స్టిక్కర్ అంటించుకోవడం వంటి సమస్యలు జర్నలిస్టులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.
ఈ మధ్యకాలంలో 239 జీవోకు సంబంధించి, నూతన మార్గదర్శకాలను రూపొందించడానికి గాను ఒక కమిటీని వేశారని, కమిటీ సభ్యులకు సంఘం తరపున అభినందనలు తెలియజేస్తుందన్నారు. దీనికి సంబంధించిన నివేదికను త్వరలో ఇవ్వాలని టీయూడబ్ల్యూజే తరపున కోరుతున్నామన్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో నూతన అక్రిడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేసి, కొత్త కార్డులను జారీచేయాలని కోరుతున్నట్టు తెలిపారు. కమిషనర్‌ను కలిసిన వారిలో ఉపాధ్యక్షులు రమేష్ హజారీ, టెంజు ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, కోశాధికారి పి.యోగనంద్, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్‌లు ఉన్నారు.