మానవత్వం చాటుకున్న జిల్లా కలెక్టర్

by Kalyani |   ( Updated:2024-12-02 16:18:33.0  )
మానవత్వం చాటుకున్న జిల్లా కలెక్టర్
X

దిశ, తూప్రాన్ : సోమవారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లు గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లిన జిల్లా పాలన అధికారులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ అదనపు కలెక్టర్ నగేష్ ,మెదక్ జిల్లా తిరుగు ప్రయాణమయ్యారు. ఇదే సమయంలో మెదక్ మక్త భూపతిపూర్ గ్రామానికి చెందిన రాజు చిన్న శంకరం పేట మండల కేంద్రంలో సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహించుకుని బైక్ పై ప్రయాణం చేస్తుండగా బైకు అదుపుతప్పి రోడ్డుపై పడడం జరిగింది. అదే సమయంలో మెదక్ వైపు వస్తున్న జిల్లా పాలన అధికారులు ప్రమాద దృశ్యాన్ని చూసి వాహనాలను ఆపి హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిమిత్తం వైద్యాధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పాలనాధికారులు చూపించిన మానవతా దృక్పథానికి ప్రజలు హర్షిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed