పోసాని మాట్లాడిన బూతులకు నాకే కోపం వచ్చింది.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |
పోసాని మాట్లాడిన బూతులకు నాకే కోపం వచ్చింది.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు, వైసీపీ(YCP) నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) అరెస్ట్‌పై ప్రముఖ నిర్మాత, నటుడు అశోక్ కుమార్(Ashok Kumar) స్పందించారు. ఇటీవల ఆయన ఓ న్యూ్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని అరెస్ట్‌పై మాట్లాడారు. ‘పోసాని కృష్ణ మురళి హద్దులు దాటి మాట్లాడారు. ఒక్కోసారి ఆయన మాటలు, బూతులు వింటుంటే నాకే కోపం వచ్చేది. అసలు ఈయనకు ఎందుకు అనిపించేది. రాజకీయంగా చేసే విమర్శలు వేరు.. వ్యక్తిగతంగా చేసే విమర్శలు వేరు.. ఈయన రెండో దారి ఎంచుకుని లిమిట్స్ క్రాస్ చేశారు. చాలా సార్లు ఫోన్ చేసి మీకెందుకు అండి అని అడగాలి అనిపించింది. కానీ కుదరలేదు. ఇప్పుడు ఆయన ఖర్మ అనుభవిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ పక్కనుందని ఎప్పుడూ చెలరేగొద్దు. ఇప్పుడు ఆయన కష్టాల్లో ఉన్నారు.. ఆ పార్టీ కాపాడుతుందా?, రాజకీయాల్లో పదవుల కోసం క్యారెక్టర్‌ను కోల్పోవద్దు. ఆర్టిస్ట్‌గా పుట్టడమే గొప్ప విషయం. ఆయన దాన్ని దాటి, క్యారెక్టర్ కూడా కొత్త కష్టాలు కొని తెచ్చుకున్నారు’ అని అశోక్ కుమార్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, అశోక్ కుమార్ తెలుగులో.. ఈశ్వర్(Eeswar Movie), ఒసేయ్ రాములమ్మ(Osey Ramulamma) వంటి చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడిప్పుడే మళ్లీ తెరమీద కనిపిస్తున్నారు. మరోవైపు పోసానికి మార్చి 26 వరకూ కోర్టు రిమాండ్ విధించింది.


Next Story