సమంత కారణంగా శత్రువులుగా మారిపోయిన .. నాగచైతన్య మరో టాలీవుడ్ హీరో!

by Hamsa |   ( Updated:2023-09-30 10:02:01.0  )
సమంత కారణంగా శత్రువులుగా మారిపోయిన .. నాగచైతన్య మరో టాలీవుడ్ హీరో!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, నాగచైతన్య ‘ఏమాయ చేసావే’ సినిమాతో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్లకు వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరు ఏ కారణంతో విడిపోయారో తెలియనప్పటికీ అభిమానులు మాత్రం వాళ్లు కలిసి మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకుని మళ్లీ కలుసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం నాగచైతన్య వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కానీ సమంత మాత్రం ఒక సంవత్సరం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండనుందని తెలుస్తోంది. సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెకేషన్స్‌కు ఇతర దేశాల్లో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరు విడాకులు తీసుకున్నప్పటి నుంచి వీరికి సంబంధించిన ఎన్నో వార్తలు వచ్చాయి.

తాజాగా, సామ్, చైకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కాగా వీళ్ళు విడాకులు తీసుకోవడం వల్ల వీళ్లతో పాటు బెస్ట్ ఫ్రెండ్స్ అయినా నాగచైతన్య టాలీవుడ్ హీరో బద్ధ శత్రువులుగా మారిపోయారట. టాలీవుడ్ హీరో రాహుల్ రవీంద్రన్, నాగచైతన్య మంచి ఫ్రెండ్స్. పరిచయమైన కొద్ది రోజులకే చాలా క్లోజ్ అయ్యారట. ఎప్పుడైతే నాగచైతన్య సమంత విడిపోయారో అప్పటి నుంచి సింగర్ చిన్మయి రాహుల్ రవీంద్రన్ సమంత వైపు వచ్చారు. ఇక అప్పటి నుంచి రాహుల్, సమంత ఇంట్లోనే ఉంటున్నాడట. ఇప్పుడు నాగచైతన్యతో పాటు అక్కినేని ఫ్యామిలీ వారికి కూడా టచ్ లేడట. అంతేకాకుండా నాగచైతన్య గురించి నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నాడని తెలుస్తోంది.

Advertisement

Next Story