Krishna Vamsi: అలా చేసి తప్పు చేశా.. క్షమించాలంటూ టాలీవుడ్ డైరెక్టర్ పోస్ట్.. కారణం ఏంటంటే?

by Hamsa |
Krishna Vamsi: అలా చేసి తప్పు చేశా.. క్షమించాలంటూ టాలీవుడ్ డైరెక్టర్ పోస్ట్.. కారణం ఏంటంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ(Krishna Vamsi) పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. చందమామ(Chandamama), శశిరేఖా పరిణయం(Shashirekha Parinyam), గోవిందుడు అందరివాడేలే, మురారి వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఒక 2023లో ఆయన ‘రంగ మార్తాండ’ తెరకెక్కించారు. రమ్యకృష్ణ(Ramya Krishna), ప్రకాష్ రాజ్(Prakash Raj) ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత నుంచి కృష్ణవంశీ ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతున్నారు.

అలాగే అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు. తాజాగా, కృష్ణవంశీ అభిమానులతో చిట్ చాట్ చేశారు. అయితే ఇందులో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలో.. ఓ అభిమాని ‘శ్రీ ఆంజనేయ’ భక్తి సినిమాలో చార్మీ కౌర్‌(Charmi Kaur)ను ఎక్స్‌పోజింగ్ చేయించారు. భక్తితో కూడుకున్న చిత్రంలో హీరోయిన్‌ను చూపించమేంటి అని అడిగాడు. ఇక దీనికి కృష్ణవంశీ ‘అలా చేయడం తప్పు. క్షమించండి తప్పని పరిస్థితుల్లో చేసిన పనులు’ అని సమాధానం ఇచ్చాడు.

ఇంతలో మరో ఓ నెటిజన్ హార్రర్ సినిమా చేస్తే చూడాలని ఉందని అడగడంతో.. ఆయన నేను కూడా హార్రర్ మూవీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నా అని అన్నారు. తర్వాత ఓ వ్యక్తి రాబరీ చిత్రం కూడా తెరకెక్కించమని అడగడంతో ..‘చెడ్డ పనిని గొప్పగా చూపించడం కరెక్డ్ కాదు. ఇలాంటి వాటికి నేను అస్సలు సపోర్ట్ చేయలేను. మనం తీసే సినిమా జనాల్లో మంచి ఆలోచన తెచ్చే విధంగా ఉండాలి. చెడ్డ పనులను ప్రోత్సహించేలా ఉండకూడదు. ఇలాంటి సినిమాలకు ఎన్ని డబ్బులు ఇచ్చినా నేను చేయను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కృష్ణవంశీ పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండటంతో.. అవి చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

Next Story

Most Viewed