స్టార్ హీరో ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్ కొనుగోలు చేసిన టాలీవుడ్ బ్యూటీ?

by Hamsa |   ( Updated:2023-08-27 03:59:45.0  )
స్టార్ హీరో ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్ కొనుగోలు చేసిన టాలీవుడ్ బ్యూటీ?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అదా శర్మ హార్ట్ ఎటాక్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో హిట్ కొట్టి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ అమ్మడు పలు మూవీస్, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా, అదా శర్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ అమ్మడు ఓ స్టార్ హీరో ఆత్యహత్య చేసుకున్న ఫ్టాట్‌ను కొనుగోలు చేసింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎంఎస్ ధోని చిత్రంతో ప్రేక్షకులను మెప్పించాడు. ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. ముంబైలోని బాంద్రా మాంట్ బ్లాంక్ అపార్ట్‌మెంట్స్‌లో 2020లో సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ఇంటిని యంగ్ బ్యూటీ అదా శర్మ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె త్వరలో ఆ ఇంటికి షిఫ్ట్ అయి అందులోనే ఉండబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ ఈ విషయం తెలిసిన నెటిజన్లు మాత్రం రకరకాలుగా అనుకుంటున్నారు.

Advertisement

Next Story