- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సింగర్ మంగ్లీ పాడిన సూపర్ హిట్ సాంగ్స్ లిస్ట్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్: మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఆమె ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. బతుకమ్మ, ఆవిర్భావ దినోత్సవ పాటలు, సినిమా పాటలు అన్న తేడా లేకుండా లెక్కలేనన్ని సాంగ్స్‌తో దూసుకుపోతుంది. అంతేకాకుండా 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది. మొట్టమొదట మంగ్లీ బతుకమ్మ పాటతో సింగర్‌గా పరిచయం అయింది. గణేష్ చతుర్థి పాట, బంజారా తీజ్, బోనాల పాట, కేసీఆర్ సాంగ్, ఉగాది, సంక్రాంతి వంటి పండుగలకు స్పెషల్ పాట పాడి అందరినీ మెప్పించింది. ఆ తర్వాత 2018లో ‘శైలజా రెడ్డి అల్లుడు చూడండి’ అంటూ పాడి సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తర్వాత పాడిన జార్జిరెడ్డి వాడు నడిపే బండి, అలా వైకుంఠపురం రాములో రాములో, జ్వాలా రెడ్డి, విక్రాంత్ రోనా నుంచి రా రా రక్కమ్మా, ఇటీవల ధమాకాలో దండ కడియాలు వంటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి. బలగంలో మంగ్లీ పాడిన ‘ఊరు పల్లెటూరు’ పాట ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది. కేవలం ఫోక్ సాంగ్సే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో పాటలు పడింది. ఇప్పటి వరకు మంగ్లీ పాడిన పాటల్లో అత్యధికంగా సూపర్ హిట్‌గా నిలవడం విశేషం. ప్రస్తుతం వరుస పాటలు పాడుతూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతుంది మంగ్లీ.