పుష్ప-2లో ఇదే హైలైట్.. భారీగా ప్లాన్ చేసిన బన్నీ, సుకుమార్!

by Hamsa |   ( Updated:2023-09-19 08:56:32.0  )
పుష్ప-2లో ఇదే హైలైట్.. భారీగా ప్లాన్ చేసిన బన్నీ, సుకుమార్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పుష్ప-2’. ఇందులో హీరోయిన్‌గా రష్మిక నటిస్తోంది. 2021లో విడుదలై సంచనాలు సృష్టించిన పుష్ప సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే పుష్ప లో సమంత ఐటెం సాంగ్‌లో చిందులేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సామ్ ప్లేస్‌లో పుష్ప-2 ఐటెం సాంగ్‌లో జాన్వి కపూర్‌ను తీసుకోనున్నారని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. సమంత సాంగ్ కంటే కూడా.. జాన్వీ కపూర్ సాంగ్ అదిరిపోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఐటమ్ సాంగ్ కి జాన్వీ కపూర్ ఒప్పుకుంటోందో లేదో చూడాలి. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఇక వచ్చే షెడ్యూల్ లో గుంతకల్లు నల్లమల అడవుల ప్రాంతంలో ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story