ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువ.. ఇది రిస్క్‌తో కూడుకున్నది.. దుమ్ముదుమారం రేపుతున్న బాలీవుడ్‌ నటి సంచలన పోస్ట్

by Kavitha |   ( Updated:2024-08-28 14:40:32.0  )
ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువ.. ఇది రిస్క్‌తో కూడుకున్నది.. దుమ్ముదుమారం రేపుతున్న బాలీవుడ్‌ నటి సంచలన పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో'లో ఆయన చెల్లెలుగా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'వీరే ది వెడ్డింగ్' సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ సినిమాలో స్వర భాస్కర్ చేసిన ఓ సీన్..అప్పట్లో సంచలనం స‌ృష్టించిన సంగతి తెలిసిందే. ఇక కేరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఈ యేడాది ఫిబ్రవరిలో తన ప్రియుడు ఎస్పీ నాయకుడు ఫహద్ అహ్మద్‌ను ఈమె పెళ్లి చేసుకుంది.

ఇదిలా ఉంటే.. హేమ కమిటీ రిపోర్ట్‌లో వెల్లడించిన షాకింగ్‌ విషయాలపై ఆమె విచారం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ఆ పోస్ట్‌లో భాగంగా.. ''హేమ కమిటీ నివేదికలోని పలు విషయాలు చదివి నేను షాకయ్యా. మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసి నా హృదయం ముక్కలైంది. ఇలాంటి పరిస్థితులు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. సినిమా పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువ. ఇది రిస్క్‌తో కూడుకున్నది కూడా. సినిమా ప్రారంభం నుంచి విడుదలయ్యే వరకూ ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటారు. ఈ క్రమంలో ఎవరైనా మహిళలు ఇలాంటి సంఘటనల గురించి పెదవి విప్పినా పెద్దగా పట్టించుకోరు. ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నటులు, నిర్మాతలు, దర్శకులను అందరూ దేవుళ్లుగా భావిస్తారు. వాళ్లు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. వారు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే.. అక్కడ ఎటువంటి నియమాలు వర్తించవు. ఎవరైనా దాని గురించి బయటకు వచ్చి గట్టిగా తమ స్వరాన్ని వినిపిస్తే.. వారిని ట్రబుల్‌ మేకర్స్‌ అని ముద్ర వేసేస్తారు '' అంటూ స్వరా భాస్కర్‌ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితుల గురించి జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ (Hema Committee Report) సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఆ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్‌ కండిషన్లు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసిన కమిటీ.. కాస్టింగ్‌ కౌచ్‌ మొదలు వివక్ష వరకు మాలీవుడ్‌లో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. దీంతో ఆ నివేదిక చర్చనీయాంశంగా మారింది.

(video link credits to swara bhasker instagram id)

Advertisement

Next Story

Most Viewed