- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మరోసారి డ్యాన్స్‌తో ఫిదా చేస్తున్న నేచురల్ బ్యూటీ.. హే మిన్నలే అంటూ నెటిజన్ల కామెంట్స్(వీడియో)

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా సాయి పల్లవి ప్రేమమ్’(Premam) మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత ‘ఫిదా’(Fidaa) సినిమాలో నటించి మెప్పించింది. అంతే కాకుండా తన యాక్టింగ్‌తో అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అంతే కాకుండా బోల్డ్ సీన్స్‌లో యాక్ట్ చేయకపోవడం, మేకప్ వేసుకోకపోవడం వల్ల మరింత ఫేమ్ అయింది. ఇక ఈ భామ డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి.
అయితే సాయి పల్లవి తాజాగా నాగ చైతన్య(Naga chaitanya) హీరోగా చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో వచ్చిన ‘తండేల్’(Thandel) సినిమాలో హీరోయిన్‌గా నటించి అలరించింది. తన యాక్టింగ్‌తో ఆడియన్స్ నుంచి ఫుల్ మార్కులే కొట్టేసింది. లవర్స్ డే కానుకగా అల్లు అరవింద్ (Allu aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు(Bunny Vasu) నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్‌లో రామాయణం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సాయి పల్లవి నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ భామకి స్టార్ హీరోలకు సమానంగా ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తాజాగా ఈ బ్యూటీ తన బంధువుల వివాహానికి హాజరయ్యారు. అక్కడ తన సోదరి, బంధువులతో కలిసి డ్యాన్స్ చేసింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాయి పల్లవి డ్యాన్స్ చూసిన అభిమానులు ఆమె ఎనర్జీని ప్రశంసిస్తున్నారు. కాగా ఈ వ వీడియోలో.. నటి సాయి పల్లవి అందమైన బ్లూ కలర్ చీరలో అదిరిపోయింది. బౌన్సీ పాట మ్యూజిక్ కు అనుగుణంగా డాన్స్ చేయడం అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు హే మిన్నలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
ఆ సినిమాలో సమంత గెస్ట్ రోల్..? క్యూరియాసిటీ పెంచేస్తున్న న్యూస్