Pushpa-2: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పుష్ప-2 నిర్మాతలు.. ఎందుకో తెలుసా?

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-06 11:43:36.0  )
Pushpa-2: మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పుష్ప-2 నిర్మాతలు.. ఎందుకో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: పుష్ప-2(Pushpa-2) చిత్ర నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నివాసానికి వచ్చారు. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో డైరెక్టర్ సుకుమార్‌(Director Sukumar)తో కలిసి గురువారం చిరంజీవి నివాసానికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నారు. అయితే గత కొంతకాలంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్ప రవికి బన్నీ మద్దతు ఇచ్చిన నాటి నుంచి వార్తలు విస్తృతమయ్యాయి.

అంతేకాదు.. పుష్ప-2 చిత్రంలోని పలు డైలాగులు కూడా మెగా ఫ్యామిలీని ఉద్దేశించే పెట్టారని చిరు, పవన్, చరణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప-2 సినిమా విడుదలైన మొదటిరోజే దర్శకుడు సుకుమార్, నిర్మాతలు నవీన్, రవిశంకర్‌లు మెగాస్టార్ ఇంటికి రావడం ఆసక్తిగా మారింది. అభిమానుల సోషల్ మీడియా టార్గెటింగ్ నుంచి బయటపడొచ్చు అనే పుష్ప-2 మూవీ టీమ్ చిరు వద్దకు వెళ్లిందని నెట్టింట్లో మరో వార్త వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed