‘త్రికాల’ మూవీ క్రేజీ అప్ డేట్ రిలీజ్

by sudharani |
‘త్రికాల’ మూవీ క్రేజీ అప్ డేట్ రిలీజ్
X

దిశ, సినిమా: శ్రద్ధా దాస్ (Shraddha Das), మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని (Amani), ప్రభాకర్ (Prabhakar), అంబటి అర్జున్, రౌడీ రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘త్రికాల’(Trikala). మణి తెల్లగూటి(Mani Tellaguti) తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ‘యుద్దం రేపటి వెలుగు కోసం.. కానీ ఈ అంధకాసురిడి యుద్దం వెలుగుని నాశనం చేయడానికి’.. అంటూ తనికెళ్ల భరణి(Tanikella Bharani) డైలాగ్స్‌తో మొదలైన ట్రైలర్.. యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్నీ కూడా హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ‘ఒక సైక్రియార్టిస్ట్‌గా ఛాలెంజింగ్ కేసుని చూస్తున్నా’ అంటూ శ్రద్దా దాస్ పాత్రను ఈ ట్రైలర్‌లో పరిచయం చేశారు. మాస్టర్ మహేంద్రన్ చేసే యాక్షన్ సీక్వెన్స్, ట్రైలర్ చివర్లో అజయ్ విశ్వరూపం, డైలాగ్స్ అదిరిపోయాయి. ఓవరల్‌గా ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుటోంది.

ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌లో దర్శకుడు మణి మాట్లాడుతూ.. ‘త్రికాల సినిమాటిక్ యూనివర్స్ అని ట్రైలర్‌లో పెట్టాం. అంబటి అర్జున్ ఒక్క రోజే షూటింగ్ చేశారు. అదేంటో ఫ్యూచర్‌లో తెలుస్తుంది. ఈ మూవీకి నాతో పాటు అన్ని రోజులు పని చేశాడు మహేంద్రన్. సాహితి పాత్రను ఎక్కువగా రివీల్ చేయకూడదని అనుకున్నా. రూప కారెక్టర్ సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. సెట్‌లో రవి వర్మ ఎప్పుడూ ఇది జరుగుతుందా? అని కంగారు పడుతుండేవారు. సాయిదీప్, వెంకట రమేష్ సెట్‌లో చాలా కష్టపడ్డారు. షాజిత్, హర్ష వర్దన్ రామేశ్వర్ సంగీతం అద్భుతంగా ఉంటుంది. మా నిర్మాతలు రాధిక, శ్రీనివాస్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. మేం ఈ మూవీ కోసం చాలా వదులుకున్నాం. నా రైటింగ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా సపోర్ట్ చేసింది. అజయ్ గారు మాకు ఈ ప్రయాణంలో అండగా నిలబడ్డారు. మా చిత్రం సమ్మర్‌లో రాబోతోంది. అందరూ సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

Next Story